యువత ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని చిట్వేలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మహమ్మద్ అన్సారి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఆదివారం చిట్వేలులో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ అలీ అన్సారీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన అన్నారు.