చిట్వేలు మండల రెవెన్యూ అధికారి మోహన కృష్ణ ఆదేశాల మేరకు గురువారం రాజారెడ్డి ఎస్టీ కాలనీలో కాలిపోయిన గుడిసె వివరాలను శుక్రవారం వీఆర్వో సేకరించారు. వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు ఉన్నత అధికారులకు నివేదిక పంపించామని చిట్వేలు ఎమ్మార్వో మోహనకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు నివేదిక పంపించినట్లు ఆయన తెలిపారు.