రైల్వే కోడూరు: పేదల ఆరోగ్యం కోసం సీఎం సహాయ నిధి

57చూసినవారు
రైల్వే కోడూరు: పేదల ఆరోగ్యం కోసం సీఎం సహాయ నిధి
పేద కుటుంబాల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి ఇస్తోందని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. చిట్వేల్ మండలానికి చెందిన 9 పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 3,78,868 లక్షల ఆర్థిక సహాయాన్ని సోమవారం ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి సకాలంలో అండగా నిలిచే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్