రాయచోటి కలెక్టరేట్ లో శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో కుడా చైర్మన్ రూపానందరెడ్డి, శాసనసభ్యులు శ్రీధర్ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఐదు మండలాలలో సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.