చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లిలో శుక్రవారం నీటి కుంటలో పడి మృతి చెందిన ముగ్గురు పిల్లలకు రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, కుడా చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి శనివారం పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.