చిట్వేలు మండలం పోళ్ళోపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న గోకులం పశువుల షెడ్డును శనివారం ఉదయం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా పరిపుష్టి పొందడం కోసం గోకులాలను ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎండిఓ, పశు వైద్యాధికారిణి పాల్గొన్నారు.