రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా ఎన్నికైన కేకే చౌదరి మొట్టమొదటిసారిగా తన సొంత మండల మైన చిట్వేలుకు వచ్చిన సందర్భంగా టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది బైకు ర్యాలీ నిర్వహించారు. నూలు మిల్లుల సమాఖ్య మాజీ చైర్మన్ కట్టా నారాయణయ్య సమాధి వద్ద, చిట్వేలు లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి, కొత్త బస్టాండ్ లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.