ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డ్ చైర్మన్ కె కె చౌదరి గురువారం బయనపల్లి శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని మొదటిసారి గ్రామానికి వచ్చినందుకు ఆలయ పెద్దలు, గ్రామంలోని ముఖ్య నాయకులు, మహిళలు, యువత చాలా ఆనందంతో, ఉరకలు వేస్తూ, బాణాసంచా కాలుస్తూ, పూలమాలలతో, మేళతాళాలతో గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు.