మాస్ కాపీయింగ్ కు తావులేకుండా ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు జరపాలని ఎంఈఓ సుందర బాబు ఆదేశించారు. బుధవారం రైల్వే కోడూరు ఎంఈఓ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాలకు గాను 1212 మంది విద్యార్థులు రెగ్యులర్ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన తెలిపారు.