ఓబులవారిపల్లి మండలం వై. కోటలో మంగళవారం రాత్రి వాన గాలి భీభత్సాన్ని సృష్టించాయి. పలు అరటి, మామిడి తోటలు నేలకొరిగాయి. కాపు నేలపాలు కావడంతో అరటి, మామిడి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎంఎల్ఏ అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పంట నష్టాన్ని బుధవారం పరిశీలించారు. రైతులకు అండగా ఉండి రైతులకు తగిన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.