రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు, కోడూరు, పుల్లంపేట, చిట్వేలి, ఓబులవారిపల్లి మండలాల్లోని గిరిజన కాలనీలలో నివసిస్తూ భర్తను కోల్పోయి ప్రభుత్వం నుంచి పింఛను మంజూరు కాని గిరిజన వితంతువులకు మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు పింఛన్లు అందజేస్తున్నారు. మంగళవారం ఉదయం తన సొంత నిధులతో ఎస్టి వితంతు మహిళకు రూ. 1000 చొప్పున బత్యాల భరోసా పింఛన్లను అందజేశారు.