ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు అన్నారు. శుక్రవారం శెట్టిగుంటలో ఎమ్మార్వో అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులలో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువస్తున్న సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.