మానవత స్వచ్ఛంద సేవా సమితి చిట్వేలి శాఖ 2024. 2025 నూతన కార్యవర్గాన్ని ఆదివారం చిట్వేలు సాయి వికాస్ పాఠశాల నందు ఎన్నుకున్నారు. మానవత కేంద్ర కమిటీ గౌరవ డైరెక్టర్ రెడ్డన్న, కడప కార్యదర్శి సుబ్బరాయుడు పాల్గొని చిట్వేలు మానవతా సేవలను ప్రశంసించారు. నూతన అధ్యక్షులుగా కుంభగిరి ముని రావు, కార్యదర్శిగా కరీం భాయి గారి సాయిరాం, కోశాధికారిగా రంగారెడ్డి లను ఎన్నుకొని వాటి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.