ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో తుఫాన్ ప్రభావం మరింత బలపడి ఎక్కువ వర్షాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు కోరారు. శనివారం రైల్వేకోడూరులో ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు అండగా ఉంటారని ఆయన తెలిపారు.