రైల్వే కోడూరు నియోజకవర్గంలో దళారులు బొప్పాయి రైతులను మోసం చేస్తున్నారని సిఐటియు నాయకత్వంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రైల్వే కోడూరు లోని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 5వ తేదీన రైల్వే కోడూరులో బొప్పాయి రైతులు, దళారులు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించాలని మార్కెటింగ్ ఏడి ని ఆదేశించారు.