ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద నారా లోకేష్ తో శుక్రవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్ కలిసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే కోడూరులో డయాలసిస్ సెంటర్, ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి నారా లోకేష్ రైల్వే కోడూరు అభివృద్ధికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు.