రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్‌ఛార్జ్ ముక్కారూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, స్వేచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముక్కా వారి పల్లి పంచాయతీ గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మొక్కలు నాటి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.