రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మహిళల పట్ల అధికారులు స్పందించరా అని ఏపీ ఎండిసీ పబ్లిక్ స్కూల్ నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓబులవారిపల్లి మండలం మంగంపేట పబ్లిక్ స్కూల్ నందు పనిచేస్తున్న వారు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఏడు రోజులుగా దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా తమను తొలగించడం అన్యాయమని వారు తెలిపారు.