ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నాలుగు ఎకరాలు అరటి తోట నేలమట్టం అయింది. ఓబులవారిపల్లి మండలం రాళ్ల చెరువురాళ్లచెరువు పల్లి పంచాయతీలో ఉన్న కృష్ణారెడ్డి అరటి తోట ఒక్కసారిగా ఉన్నట్లుండి గాలి వీచడంతో అరటి తోట నేలమట్టం అయింది. అప్పులు చేసి పంటలు పండిస్తే చేతికి వచ్చే సమయంలో ఇలా జరుగుతుంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపి సహాయం చేయాలన్నారు.