ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామ పంచాయతీలో అకాల ఈదురు గాలులు వీయడంతో అరటి తోటలు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి గాలి అధికంగా రావడంతో నియోజకవర్గంలో అత్యధికంగా పండించే అరటి తోటలు దాదాపుగా ధ్వంసం అయ్యాయి. వారం క్రితం వీచిన ఈదురు గాలులకు కూలిన అరటి తోటలు, రాత్రి వీచిన గాలులకు పూర్తిగా నేల మట్టం అయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.