ముక్కావారి పల్లె టీటీడీ కళ్యాణ మండపంలో అరవ శ్రీనివాసులు, లక్ష్మీ ప్రసన్న కుమారుడు మహేష్ వివాహం మానసతో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, టీడీపీ యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ కూటమి నాయకులు పాల్గొన్నారు.