ఓబులవారిపల్లి మండలం బొమ్మవరం బి. కమ్మపల్లిలో నిర్మించిన మినీ గోకులం పశువుల షెడ్లను కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. మినీ గోకులాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.