ఓబులవారిపల్లి మండలం అయ్యలరాజు పల్లి హరిజన వాడలో వర్షం కారణంగా రెండు ఇండ్లు కూలిపోయాయి. దాసరి సుబ్రమణ్యం పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పని చెయ్యవు. ఈ వర్షం రూపంలో ఇల్లు కూడా కూలగొట్టింది. నిలువ నీడ కోల్పోయిన మమ్ములను ప్రభుత్వ అధికారులు మా గ్రామానికి వచ్చి పరిశీలించి మమ్ములను ఆదుకోవాలని వారు కోరారు. మండల రెవెన్యూ అధికారులు తక్షణ సహాయం అందించాలని వారు కోరారు.