వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల సబ్ జైళ్లను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఖైదీలతో మాట్లాడి కేసు పూర్వపరాలు, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిసరాలు, వంట గదులను పరిశీలించి పలు సిబ్బందికి సూచనలిచ్చారు.