ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధితో పాటుగా యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని తెలుగు యువత రాష్ట్ర నాయకులు చిగురుపాటి ధనుంజయ నాయుడు అన్నారు. మంగళవారం పెనగలూరులో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఫీజు పోరు అంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హితవు పలికారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.