పెనగలూరు మండలం ఓదేటివారిపల్లెలో భూ తగాదా విషయంలో శనివారం శిరిశెట్టి సుమతి అనే మహిళపై శిరిశెట్టి చంద్రశేఖర్ అతని భార్య లక్ష్మిదేవి, వారి కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా దాడి చేశాడు. ఇది గమనించి స్థానికులు 108 కి ఫోన్ చేయగా స్పందించిన అంబులెన్స్ సిబ్బంది వెంటనే పెనగలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.