మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దుర్భాషలాడిన ఐటీడీపీ కార్యకర్త చేబోలు కిరణ్ పై వైసీపీ పెనగలూరు మండల కార్యకర్తలు హరిప్రసాద్ నాయుడు, నాగభూషణం, రెడ్డయ్య నాయుడు, శివ శుక్రవారం ఎస్సై రవి ప్రకాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అతని వ్యాఖ్యలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మనోభావాలను, వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.