రైల్వే కోడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గోసాల దేవి, రాష్ట్ర నాయకులు శాంతయ్య ఆధ్వర్యంలో 134వ మహాత్మ జ్యోతి రావు ఫూలే వర్ధంతిని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల దేవి, శాంతయ్య మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనముపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్య అవకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అన్నారు.