టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు లింగుట్ల వెంకటరమణ తండ్రి లింగుట్ల వెంకటయ్య నాయుడు దశదిన కర్మలో.. గురువారం రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి పాల్గొని వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. పుల్లంపేట మండలం కొటాలపల్లిలో వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆరే సుధాకర్ పాల్గొన్నారు.