పుల్లంపేట మండలం దళవాయి పల్లిలో మినీ గోకులంను శుక్రవారం కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వేకోడూరు టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి ప్రారంభించారు. పుల్లంపేట కూటమి నాయకులు కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మినీ గోకులం ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.