రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అతిపెద్ద నది గుంజున నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెంగ్వల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి గుంజన నది ఉధృతంగా ప్రవహించడంతో విపిఆర్ కండ్రికకు వెళ్లే మట్టి రోడ్డు కోతకు గురి అయింది. మట్టి రోడ్డు కోతకు గురి కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.