ఆలిం కో కంపెనీ హైదరాబాద్, అన్నమయ్య జిల్లా యంత్రాంగం సమన్వయంతో 335 మంది విభిన్న ప్రతిభావంతులకు 667 సహాయ ఉపకరణాలు రూ. 55 లక్షల వ్యయంతో మంగళవారం రైల్వే కోడూరు హెచ్‌యంయం ఉన్నత పాఠశాల నందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, సంచాలకులు రవి ప్రకాష్ రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు.