రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజంపేట ఉద్యానవనంలో డా. వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రిబ్బన్ కట్ చేసి కిసాన్ మేళా ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కీలక చర్యలపై వివరించారు.