అన్నమయ్య జిల్లాలో మాత్రమే అంగన్వాడీలకు నోట్ క్యామ్ చేయమని అధికారులు చెప్పడం మానుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు సరోజమ్మ కోరారు. గురువారం రైల్వేకోడూరులో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సెల్ ఫోన్లు పని చేయడం లేదని, అంగన్వాడీల సొంత ఫోన్ లోనే పోషణ ట్రాకర్, బాల సంజీవిని, ఎఫ్ఆర్ఎస్, మిల్కు యాప్ లు అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్నారని తెలిపారు.