వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసిపి పార్టీకి విశేష సేవలు అందించిన సీనియర్ నాయకులు పంజం సుకుమార్ రెడ్డిని శనివారం జిల్లా వైసిపి అధికార ప్రతినిధిగా నియమించారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా పని చేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించడంతో పార్టీలో మరింత బాధ్యత పెరిగిందని సుకుమార్ రెడ్డి అన్నారు.