రైల్వే కోడూరు మండలం శేషాచలం అడవులలో బీటెక్ విద్యార్థులు దారి తప్పారు. శుక్రవారం శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు విద్యార్థులు వాగేటి కోన ప్రాంతంలో గుంజన జలపాతాలను చూడడానికి విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పినట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న రైల్వే కోడూరు పోలీసులు విద్యార్థుల కోసం అడవులలో వెతకడానికి వెళ్లారు.