గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, నియోజకవర్గ టిడిపి బాధ్యులు రూపానంద రెడ్డి అన్నారు. ఓబులవారిపల్లి మండలం బోటు మీద పల్లె నుండి కాకర్లపల్లి వరకు రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 60 లక్షల తో సిసి రోడ్డు, గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.