రైల్వే కోడూరు మండలం వివి కండ్రిగ గ్రామం వినాయక నగర్ గిరిజన కాలనీలో నివసిస్తున్న గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి జయరామయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి వినాయక నగర్ వరకు రోడ్డు, వీధిలైట్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడి పాఠశాల కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.