శనివారం మధ్యాహ్నం కోడూరు మండలం మైసూరువారిపల్లి పంచాయతి నందు ఉన్న మాంగో యార్డ్ ను మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు సందర్శించి అక్కడ ఉన్న రైతులు, వ్యాపారస్థులతో మాట్లాడి వారి కష్టాల ను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపార రంగమే పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది అని అన్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు.