మామిడిరైతులను రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని శనివారం కుడా చైర్మన్ రైల్వేకోడూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. తోతాపురి మామిడికాయలకు రాష్ట్రప్రభుత్వం కిలో రూ. 4 సబ్సిడీ అందిస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి మామిడికాయల ధరలను తగ్గించి రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారన్నారు. అటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.