పురుగుల మందు తాగి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రైల్వే కోడూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవరాజు పురం దళిత వర్గానికి చెందిన మహిళను సక్రమంగా డబ్బులు కట్టలేదని డ్వాక్రా గ్రూపు నుండి తొలగించారు. ఈ కారణంతో మనస్థాపం చెందిన ఆమె సోమవారం వెలుగు కార్యాలయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. తోటి మహిళలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.