రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ కార్యాలయంలో వ్యాపార నిర్వహణ, వ్యవస్థాపకత, నైపుణ్య అవకాశాలపై మహిళలకు బుధవారం మూడురోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి మాట్లాడుతూ మహిళలు నైపుణ్యంతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, అందుకు నిపుణుల ద్వారా ఇచ్చే శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.