

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు
AP: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ జిల్లా ఏర్పాటుపై గతంలో సీఎం చంద్రబాబు హామీ కూడా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కొత్త జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.