రైల్వేకోడూరు: వై. కోటలో చెరువు నిండి పొర్లుతున్న అలుగు

53చూసినవారు
రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం వై. కోట సమీపంలోని చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. ఫెంగల్ తుఫాను కారణంగా శనివారం, ఆదివారాలలో కురిసిన వర్షానికి వంకలు, అడవి నుండి వర్షపు నీరు ఉదృతంగా రావడంతో సోమవారం వై. కోట చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. అలుగు నుండి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఎవరు ఆ ప్రాంతానికి వెళ్లొద్దని గ్రామస్తులు అందరిని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్