విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రైల్వే కోడూరు రామాపురం మండల పరిధిలోని బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. వీరారెడ్డి మంత్రికి వినతిపత్రం సమర్పించారు.