ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు జూనియర్ కళాశాలలో తరగతి గదుల కొరత లేకుండా త్వరలోనే మూడు గదులు నిర్మిస్తామని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి అన్నారు. శుక్రవారం జూనియర్ కాలేజీకి సిమెంటు రహదారి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తరగతి గదుల నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.