ముక్కా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కుడా చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి కోరారు. బుధవారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ పుల్లంపేట ఎస్‌బివిడి సభ ఉన్నత పాఠశాలలో ఆదివారం తిరుపతి ఎస్‌వి అరవింద్ కంటి ఆసుపత్రి వారిచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.