చిట్వేలు లోని గాజుల వీధిలో బుధవారం నుండి శుక్రవారం వరకు శ్రీ హనుమ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బుధవారం చిట్వేలు గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెంకట సత్యనారాయణ శర్మ(సతీష్) ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.