రాజంపేటలో గుంతకల్ డిఆర్ఎం ను గురువారం గుంతకల్ డివిజన్ రైల్వే బోర్డు మెంబర్ తల్లం భరత్ కుమార్ రెడ్డి కలిసి రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, రాజంపేట, నందలూరు రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్ళను నిలపాలని కోరారు. పేరులో రైలు ఉంది గాని రైల్వే కోడూరులో రైళ్లు ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా ఇక్కడ ఆగకుండా నిలిచిన రైళ్ళను తప్పనిసరిగా ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.