స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహానికి శనివారం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి పూలమాలవేసి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేనాటి గడ్డపై అధిక పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా రాయల సీను రైతుల హక్కుల కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా వడ్డె ఓబన్న పోరాటం చేశాడని అన్నారు.